ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యూ పోస్టర్ తో భారీగా పెరిగిన 'ఏజెంట్' టీజర్ అంచనాలు

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 14, 2022, 11:01 AM

అక్కినేని అఖిల్ కొత్త సినిమా "ఏజెంట్" పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుండి ఇప్పటివరకు ఎలాంటి వీడియో గ్లిమ్స్, టీజర్ వంటివి విడుదల కాకపోయినా, కేవలం అఖిల్ పోస్టర్లతోనే సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవ్వడం నిజంగా గ్రేట్.
లేటెస్ట్ గా ఈ మూవీలో కీలక పాత్రను పోషిస్తున్న మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేసారు. గన్ను చేతపట్టిన మమ్ముట్టి చాలా ఇంటెన్స్ గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ తో ఇంకా రెండ్రోజుల్లో రిలీజ్ అయ్యే టీజర్ పై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి.
సురేందర్ రెడ్డి డైరెక్షన్లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాక్షివైద్య హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa