అక్కినేని వారసుడు అఖిల్ కెరీర్లో తొలిసారి భారీ బడ్జెట్ తో నిర్మింపబడుతున్న చిత్రం "ఏజెంట్". సురేందర్ రెడ్డి డైరెక్షన్లో సూపర్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాక్షివైద్య అనే కొత్తమ్మాయి హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
ఇటీవలే మూవీ టీజర్ ను జూలై 15వ తేదీ విడుదల చేస్తామని చెప్పిన మేకర్స్ తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్ డీటెయిల్స్ ను తెలుపుతూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ మేరకు రేపు మధ్యాహ్నం మూడు గంటల నుండి, హైదరాబాద్, కూకట్ పల్లిలోని మల్లిఖార్జున థియేటర్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహింపబడుతుంది. సాయంత్రం 5:05 నిమిషాలకు ఏజెంట్ టీజర్ రిలీజ్ కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 12న తెలుగు, తమిళం, మలయాళం హిందీ, కన్నడ భాషలలో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa