టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య బాలీవుడ్ డిబట్ చిత్రం "లాల్ సింగ్ చద్దా". అద్వైత్ చందన్ డైరెక్షన్లో మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ జంటగా నటించిన ఈ చిత్రంలో చైతూ ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటించాడు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ ప్రీమియర్ షోను టాలీవుడ్ దిగ్గజాలు మెగాస్టార్ చిరంజీవి, గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి, సుకుమార్, కింగ్ నాగార్జున లకు ఆమీర్ ఖాన్ స్పెషల్ గా ప్రదర్శించినట్టు తెలుస్తుంది. ఈ ప్రదర్శన హైదరాబాద్ లోని చిరు సొంతింటిలో, ఈ వారంలోనే జరిగింది. ఈ మేరకు ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ పిక్ లో కింది వరుసలో నాగార్జున, రాజమౌళి, సుకుమార్ కూర్చుని ఉండగా, పై వరుసలో చైతు, చిరు, ఆమిర్ ఖాన్ కూర్చుని సినిమా చూస్తూ ఉంటారు. ఆమిర్ ఖాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగానిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా, పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa