క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్, రష్మిక మండన్నా జంటగా నటించిన చిత్రం "పుష్ప". గతేడాది విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నార్త్ లో ఐతే ఈ సినిమా ఒక ప్రభంజనం. దీంతో పుష్ప సీక్వెల్ పై దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
ఈ మూవీపై వినిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఆగస్టు మూడవ వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. పుష్ప సీక్వెల్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాక, మొదటి భాగంలో చేసిన మిస్టేక్స్ ను సుకుమార్ సీక్వెల్ లో రిపీట్ చేయకుండా, సినిమా ప్రమోషన్స్ భారీ రేంజులో చెయ్యాలని కోరుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa