క్యారెట్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం.. వారానికి కేవలం రెండు సార్లు క్యారెట్లు తింటే కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్యాల నుంచి దూరంగా ఉండవచ్చు. ఇటీవల జరిగిన అధ్యయనంలో వారానికి 2 నుంచి 4 పచ్చి క్యారెట్లు తినడం వల్ల కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదం 17 శాతం తగ్గుతుందని తేలింది. క్యారెట్లలో కెరోటినాయిడ్స్, లుటీన్, బీటా-కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, కంటి సమస్యలను నివారిస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa