ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రాలో దుమ్ములేపిన రవితేజ "RROD" బిజినెస్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 14, 2022, 05:47 PM

ఈ ఏడాది "ఖిలాడీ" సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మాస్ రాజా రవితేజ ప్రేక్షకులను మెప్పించలేక భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తదుపరి ఒకేసారి మూడు సినిమాలను పట్టాలెక్కించిన రవితేజ, ఈ నెల్లో రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఖిలాడీ ఫ్లాప్ తో ఈ మూవీ బిజినెస్ పై ఎఫెక్ట్ పడుతుందని అంతా అనుకున్నారు కానీ, లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, రామారావు ఆన్ డ్యూటీ ఆంధ్రాలో రూ. 8 కోట్ల సాలిడ్ బిజినెస్ ను జరుపుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఖిలాడీ ఎఫెక్ట్ ఏ మాత్రం రవితేజ జోరుకు కట్టడి వేయలేకపోయిందనే చెప్పాలి. ఇంకా, ఈ సినిమా ఏ ఏరియాలో ఎంతెంత బిజినెస్ జరుపుకుందో తెలియాల్సి ఉంది.
శరత్ మండవ డైరెక్షన్లో పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జూలై 29వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa