ట్యాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తున్న మల్టీ లింగువల్ లేడీ ఓరియెంటెడ్ చిత్రం "గార్గి". ఈరోజే ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది.
లేటెస్ట్ గా గార్గి డిజిటల్ పార్టనర్ ఖరారైనట్టు తెలుస్తుంది. ప్రఖ్యాత సోనీ లివ్ ఓటిటి గార్గి డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. గార్గి పెర్ఫార్మన్స్ అండ్ ప్రేక్షకుల రెస్పాన్స్ ను బట్టి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో కాళీ వెంకట్, ఐశ్వర్య లక్ష్మి, శివాజీ, శరవణన్, జయప్రకాశ్ తదితరులు నటించారు. గౌతమ్ రామచంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడిగానే కాక కో ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారు. ఈ సినిమాను తమిళంలో హీరో సూర్య, జ్యోతిక, తెలుగులో హీరో రాణా సమర్పించడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa