బాలీవుడ్ నటి కాజోల్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు. నేడు ఓటీటీలు రావడం వల్ల నటీనటులకు మంచి అవకాశాలు వస్తున్నాయని, హీరోయిన్లు సులభంగా రాణిస్తున్నారని అన్నారు. కానీ ఆనాటి రోజుల్లో శరీర కొలతలు ప్రామాణికంగా తీసుకుని హీరోయిన్లను ఎంపిక చేసేవారన్నారు. కాగా నటి కాజోల్ 'బేఖుదీ'తో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.