షారుక్-సల్మాన్‌లను ఉద్దేశిస్తూ ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ పతనానికి 'కింగ్స్, బాద్‌షాలు, సుల్తాన్‌లు' కారణమని ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
వాస్తవ కథలతో బాలీవుడ్‌ను ప్రజల పరిశ్రమగా మార్చితే, అది ప్రపంచ చలనచిత్ర పరిశ్రమను నడిపిస్తుందని పేర్కొన్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'ది కాశ్మీర్ ఫైల్స్' రూ.250 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.