అటు హీరో గానూ, ఇటు విలన్ గానూ చేస్తూ తెలుగు, తమిళ భాషలో మంచి పేరు తెచ్చుకున్న నటుడు ఆది పినిశెట్టి. తాజాగా ఆయన విలన్ గా నటించిన ది వారియర్ సినిమా థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ది వారియర్ చిత్రం పెళ్ళికి ముందు రిలీజ్ అయ్యుంటే హీరోయిన్ నిక్కీతో తన పెళ్లి జరిగేది కాదని అన్నారు. పెళ్లి తర్వాత విడుదల కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.