ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ తాజాగా నటించిన షంషేరా చిత్రం జులై 22న విడుదల కానుంది. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో ఆయన చేస్తున్న చిత్రం యానిమల్ లో కొంచెం నెగెటివ్ ఛాయలు ఉన్న పాత్రలో పాత్రలో కనిపిస్తానని చెప్పారు. ఆ పాత్రలో నటించడం ఓ వైపు సంతోషాన్ని కలిగిస్తున్నా, మరోవైపు కొంచెం భయంగా ఉందన్నారు.