ఐశ్వర్య రాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బ్యూటీ సీక్రెట్ చెప్పింది. 'ఆవిరి మీద ఉడికించిన తాజా కూరగాయలను తింటాను. మామూలు రైస్ తినకుండా బ్రౌన్ రైస్ తీసుకుంటాను. మూడు పూటలు కడుపు నిండుగా తినకుండా కొంచెం కొంచెంగా నాలుగైదు పూటలు తింటాను. మంచి నీళ్లు బాగా తాగుతాను. మా అమ్మ ఇవే పాటిస్తుంది. నేనూ చిన్నప్పట్నుంచి ఇవే ఫాలో అవుతున్నాను' అని తెలిపింది.