తాజాగా థాంక్యూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న దిల్ రాజు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. జీవితంలో అన్నీ చూసి వచ్చాను. ఇంత సక్సెస్ అయ్యాను అంటే అది నా ఒక్కడి వల్లే కాదు. ఎంతోమంది సపోర్టు చేశారు. అమ్మానాన్నలకు థాంక్స్ నన్ను మంచి వ్యక్తిగా పెంచారు. ఇక నా భార్య అనిత 27 ఏళ్ళ ప్రయాణంలో అండగా నిలబడింది. ఆమె సహకారం వల్లే ఈ స్థాయికి వచ్చానంటూ దిల్ రాజు భార్యను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.