నటి వరలక్ష్మికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. తాను కరోనా బారిన పడినట్లు సోషల్ మీడియా పోస్టు ద్వారా ఆమె తెలియజేసింది. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని సూచించింది.
గత రెండు మూడు రోజులుగా తనతో ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని తెలిపింది. ఆమె త్వరగా కోలుకోవాలని ఆమె పోస్టుకు డైరెక్టర్ గోపిచంద్ మలినేని కామెంట్ చేశారు.