ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఢిల్లీ పోలీసులు వినూత్న చర్య చేపట్టారు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద జంప్ చేయకుండా నిరోధించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.
సిగ్నల్ లైటులో బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఫొటో పెట్టారు. అంతేకాకుండా సిగ్నల్ పడిన తరువాత ఎవరైనా బండిని ముందుకు పోనిస్తే ఓ సినిమాలో ఆమె వాయిస్‌తో కూడిన హెచ్చరికను మైక్‌లో వినిపిస్తున్నారు. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.