చాన్నాళ్లుగా మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ కొంచెం సేపటి క్రితమే విడుదలైంది. ట్రైలర్ ను బట్టి ఇదొక అడ్మినిస్ట్రల్ యాక్షన్ థ్రిల్లర్ గా కనిపిస్తుంది. అప్పటి వరకు చట్టప్రకారం డ్యూటీ చేసిన రామారావు ధర్మం కోసం డ్యూటీ చెయ్యడం మొదలుపెడతాడు. రామారావు అలా ఎందుకు చేయవలసి వచ్చింది? అనే ప్రశ్నకు చాలా ఇంటరెస్టింగ్, థ్రిల్లింగ్ సమాధానాన్ని వెండితెరపై చూడాల్సిందే. ట్రైలర్ ఆద్యంతం చాలా థ్రిల్లింగ్ గా సాగింది. రవితేజ యాజూజువల్ తన ఇంటెన్స్ మాస్ యాక్షన్ తో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా సామ్ సీఎస్ అందించిన సంగీతం సన్నివేశాలకు బలంగా నిలుస్తుంది. ఇక, సినిమాలో కూడా సామ్ సంగీతం ఇలానే ఉంటే, థియేటర్లలో బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం.
శరత్ మండవ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, RT టీం వర్క్స్ బ్యానర్ లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 29వ తేదీన విడుదల కాబోతుంది.