విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో ఫీల్ గుడ్ మూవీ గా తెరకెక్కుతున్న చిత్రం "థాంక్యూ". ఇందులో రాశిఖన్నా, అవికాగోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 22 న విడుదల కాబోతుంది.
లేటెస్ట్ బజ్ ప్రకారం, థాంక్యూ రన్ టైం సుమారు మూడు గంటలంట. రెండు గంటల యాభై నిమిషాల సుదీర్ఘ నిడివితో థాంక్యూ థియేటర్లలో విడుదల కాబోతుందట. నాచురల్ స్టార్ నాని కొత్త చిత్రం అంటే సుందరానికి సినిమా కూడా మూడు గంటల నిడివితో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు థాంక్యూ సినిమా కూడా మూడు గంటల నిడివితో విడుదలవబోతుందని తెలిసి అక్కినేని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.