అఖిల్ అక్కినేని ఏజెంట్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. లేటెస్ట్ గా రిలీజైన ఏజెంట్ టీజర్ ప్రేక్షకుల అభిరుచి, అంచనాలకు తగినట్టుగా ఉండడంతో యూట్యూబు లో ఏజెంట్ టాప్ ట్రెండింగ్ పొజిషన్లో దూసుకుపోతున్నాడు. అఖిల్ స్టైలిష్ మేకోవర్, సురేందర్ రెడ్డి సూచనలు, లవర్ బాయ్ నుండి బీస్ట్ మాదిరి మారిన వైనం ఫ్యాన్స్ కు నిద్రపట్టకుండా చేస్తుంది. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
నిజానికి సురేందర్ రెడ్డి ఏజెంట్ స్క్రిప్ట్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వినిపించారని లేటెస్ట్ టాక్. ఆయనకు కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసారని, అదే కథను కుర్ర హీరో అఖిల్ తో సినిమాగా తీస్తున్నారట. దీంతో పవన్ కళ్యాణ్ స్థానంలో అఖిల్ ను ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. ఈ విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు పవర్ స్టార్ ను ఇలాంటి బీస్ట్ తరహా ఇంటెన్స్ యాక్షన్ సినిమాలో చూడలేకపోయామే అని బాధపడుతున్నారు.