టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కెరీర్లో తొలిసారి పవర్ఫుల్ పోలీసాఫీసర్ గా నటించిన చిత్రం "ది వారియర్". కోలీవుడ్ డైరెక్టర్ ఎన్. లింగుసామి డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కృతిశెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు.
తెలుగు, తమిళ భాషలలో జూలై 14న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. తొలి షోతోనే పాజిటివ్ టాక్ అందుకోవడంతో వారియర్ టీం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను సైతం లెక్క చెయ్యకుండా వారియర్ ను చూసేందుకు థియేటర్లకు వస్తున్నారని, ఇందుకు తనకు చాలా సంతోషంగా ఉందని హీరో రామ్ చెప్పారు.