టైర్ 2 హీరోలు అంటే రామ్, నాని, శర్వానంద్, వరుణ్ తేజ్,నాగ చైతన్య, అడవిశేష్ వంటి వారిని దాటుకుని అఖిల్ అక్కినేని ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసాడు. నిన్న విడుదలైన అఖిల్ కొత్త సినిమా "ఏజెంట్" టీజర్ కు ప్రేక్షకులు అందిస్తున్న మాస్ రెస్పాన్స్ తో అఖిల్ ఈ రికార్డును క్రియేట్ చేయగలిగాడు. ఇప్పటి వరకు టైర్ 2 హీరోల కొత్త సినిమా టీజర్లు యూట్యూబు లో తొలి 24 గంటల్లో అంటే మొదటి రోజు వ్యూస్ లో అఖిల్ ఏజెంట్ రెండవ స్థానాన్ని, లైక్స్ లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అఖిల్ ఏజెంట్ టీజర్ కు మొదటి రోజు 9.78 మిలియన్ వ్యూస్ రాగా, 460.2 కే లైక్స్ వచ్చాయి. ఫస్ట్ డే ఇన్ని లైక్స్ రావడం టైర్ 2 హీరోల హిస్టరీలో రికార్డ్. ఇక, తొలిరోజు ఎక్కువ వ్యూస్ అందుకున్న టీజర్ గా నాచురల్ స్టార్ నాని "అంటే సుందరానికి"(10.36M) అగ్రస్థానంలో ఉంది. ఫస్ట్ డే ఎక్కువ లైక్స్ వచ్చిన టీజెర్లలో నాని అంటే సుందరానికి (313కే) ఉండడం విశేషం.