హైదరాబాద్ లో ఈ రోజు "పప్పు స్టూడియోస్" అనే డబ్బింగ్ స్టూడియో ఇనాగ్యురేషన్ కార్యక్రమం జరిగింది. ఈ స్టూడియో ఓపెనింగ్ కు మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన సతీమణి సురేఖ గారు, హీరో నితిన్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ ముగ్గురి చేతుల మీదుగా కొత్త స్టూడియో ప్రారంభమైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం మెగాస్టార్ గాడ్ ఫాదర్, మెగా 154, భోళా శంకర్ సినిమాలతో బిజీగా ఉండగా, నితిన్ ఇటీవలే మాచర్ల నియోజకవర్గం సినిమా షూటింగును పూర్తి చేసాడు. ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కు రెడీ అవుతుంది.