టాలీవుడ్ మాస్ రాజా రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం "రామారావు ఆన్ డ్యూటీ". శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మజిలీ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ మూవీ ట్రైలర్ ఈ రోజు విడుదల కాబోతుందని నిన్న మేకర్స్ అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఐతే, ట్రైలర్ లాంచ్ రాత్రి ఎనిమిది గంటలకు జరుగుతుందని ప్రకటించిన మేకర్స్ తాజాగా ఈ టైం ను కాస్తంత ముందుకు జరిపినట్టు తెలుస్తుంది. దీని ప్రకారం, జూలై 16వ తేదీ రాత్రి ఏడు గంటల పదకొండు నిమిషాలకు ట్రైలర్ విడుదలవుతుంది. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఈ ఈవెంట్ జరుగుతుంది. ఈ ఈవెంట్ కు డైరెక్టర్లు గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, బాబీ, త్రినాథరావు నక్కిన, సుధీర్ వర్మ, వంశీ కృష్ణ నాయుడు స్పెషల్ గెస్ట్స్ గా హాజరు కానున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, RT టీం వర్క్స్ బ్యానర్ లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 29వ తేదీన విడుదల కాబోతుంది.
![]() |
![]() |