డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం "లైగర్". ఇందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ప్రఖ్యాత బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాధ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఈ సినిమాతో భారతీయ సినీ రంగ ప్రవేశం చెయ్యడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుండడంతో మేకర్స్ గత కొన్ని రోజుల నుండి ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. ఈ మేరకు కొంచెంసేపటి క్రితమే మేకర్స్ సూపర్ అప్డేట్ ఇచ్చారు. లైగర్ ట్రైలర్ ను జూలై 21వ తేదీన విడుదల చెయ్యబోతున్నట్టు ప్రకటించి విజయ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ను చెప్పారు.