నితిన్, కృతిశెట్టి జంటగా, కొత్త దర్శకుడు MS రాజశేఖర్ డైరెక్షన్లో పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం "మాచర్ల నియోజకవర్గం". శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేథరిన్ థెరిస్సా మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. మహతీ స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 12న విడుదలవడానికి సిద్ధమవుతున్న ఈ సినిమా లేటెస్ట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ మేరకు హీరో నితిన్ సినిమాలో తన పాత్రకు డబ్బింగ్ చెప్తున్న ఫోటోను మేకర్స్ రిలీజ్ చేసారు.