నిన్నటి వరకు జరిగిన ప్రచారం మేరకే మెగా 154లో రవితేజ నటించడం ఖాయమైంది. మెగా 154 టీం లోకి రవితేజ ని ఆహ్వానిస్తూ, కొంచెంసేపటి క్రితమే మేకర్స్ స్పెషల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ఈ వీడియోలో రవితేజ ఎంట్రీ, చిరు చెయ్యందించి క్యారవాన్ లోకి ఆహ్వానించడం, బ్యాక్ గ్రౌండ్ లో మాతో పెట్టుకుంటే మడతడిపోద్ది.... రవితేజ సూపర్ హిట్ సాంగ్ డీజే రీమిక్స్... మొత్తానికి త్వరలోనే మాస్ మెగా తుఫాన్ థియేటర్లలో సునామీని సృష్టించబోతుందని తెలుస్తుంది.
కే ఎస్ రవీంద్ర డైరెక్షన్లో పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తుండగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2023 జనవరి విడుదల కానుంది.