యంగ్ టైగర్ ఎన్టీఆర్ గతేడాది తన భార్య లక్ష్మి ప్రణతి పుట్టినరోజు కానుకగా హైదరాబాద్ ఔట్ స్కర్ట్స్ లో ఒక ల్యాండ్ ను కొని ఇచ్చారు. సుమారు ఆరున్నర ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ ల్యాండ్ లో ఒక విశాలమైన ఫార్మ్ హౌస్ ను కట్టించుకుని అందులో తన క్లోజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కు పార్టీలను ఇస్తున్నారు. ఈ ఫార్మ్ హౌస్ పరిసరాలు మొత్తం కూడా పచ్చని చెట్లతో, రకరకాల మొక్కలతో నిండిపోయి, మనసుకు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుందట. తన మనసుకు ఎంతో ప్రశాంతతనిచ్చే ఈ ఫార్మ్ హౌస్ కు తారక్, బృందావనం అని పేరు పెట్టాడట. 2010లో విడుదలైన తారక్ సూపర్ హిట్ చిత్రం బృందావనం. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో తారక్ సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను ఫుల్ ఫిదా చేసారు.