సీనియర్ హీరో అర్జున్ దర్శకనిర్మాణంలో, ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్ టాలీవుడ్ కు పరిచయమవుతున్న విషయం తెలిసిందే కదా. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నారు. సీనియర్ హీరో జగపతిబాబు కీ రోల్ ప్లే చేస్తున్నారు. శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై అర్జున్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే పూజాకార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీ తాజాగా ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలెట్టినట్టు తెలుస్తుంది. ఈ మేరకు మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ తో మ్యూజిక్ చర్చలు జరుపుతున్న విశ్వక్, అర్జున్ ల ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
ఈ సినిమాకు స్టార్ రైటర్ సాయిమాధవ్ బుర్రా రచయితగా, నీరజ కోనా కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa