సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబోలో 2006లో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ "పోకిరి". ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. అప్పట్లో ఈ చిత్రం సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఆల్ టైం టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటిగా, మహేష్ కెరీర్ ను యూటర్న్ తిప్పి మాస్ ఇమేజ్ ను కట్టబెట్టిన చిత్రంగా, మహేష్ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.
తాజాగా ఈ చిత్రాన్ని 4k రీమాస్టర్డ్ వెర్షన్ ను మరోసారి థియేటర్లలో విడుదల చేయబోతున్నారట. వరస సినిమాల విడుదలలతో చాలా రద్దీగా ఉండబోయే ఆగస్టు నెల్లోనే ఈ సినిమా కూడా విడుదల కాబోతుండడం విశేషం. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9వ తేదీన ఈ సినిమా మరోసారి ప్రేక్షకులను పలకరించబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa