టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నటసింహ నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. ఈ కాంబినేషన్ లో రానున్న సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. తాజా అప్‌డేట్ ప్రకారం, అనిల్ రావిపూడి రైటర్స్ తో కలిసి ఈ సినిమా పూర్తి స్క్రిప్ట్‌ను కంప్లీట్ చేసినట్లు సమాచారం. దసరా పండుగ తర్వాత సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'NBK107' సినిమాతో బిజీగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa