కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ తొలిసారి మెగాఫోన్ పట్టి డైరెక్ట్ చేసిన చిత్రం రాకెట్రి: ది నంబి ఎఫెక్ట్ . జూలై 1వ తేదీన విడుదలైన ఈ చిత్రం డీసెంట్ టాక్ తో సక్సెస్ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతుంది.
లేటెస్ట్ గా ఈ సినిమా డిజిటల్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. జూలై 26వ తేదీ నుండి ప్రఖ్యాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో రాకెట్రి స్ట్రీమింగ్ కాబోతున్నట్టు సదరు ఓటిటి సంస్థ కొంచెంసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేసింది.
ఇండియాలో స్పేస్ రీసెర్చ్ అభివృద్ధి కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొని, తన జీవితాన్ని సైతం త్యాగం చేసిన పద్మ భూషణ్ నంబి నారాయణన్ బయోపిక్ గా రూపొందిన ఈ చిత్రం పలువురు సినీ సెలెబ్రిటీలను, సినీ విశ్లేషకులను విశేషంగా మెప్పించింది. హిందీలో షారుఖ్ ఖాన్, తమిళ్, తెలుగులో హీరో సూర్య పోషించిన క్యామియో రోల్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ట్రై కలర్ ఫిలిమ్స్, వర్ఘిస్ మూలాన్ పిక్చర్స్, 27th ఇన్వెస్ట్మెంట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.