ఇషాన్ సూర్య దర్శకత్వంలో టాలీవుడ్ హీరో విష్ణు మంచు ఒక సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ మరియు బాలీవుడ్ యాక్ట్రెస్ సన్నీలియోన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి 'జిన్నా' అనే టైటిల్‌ను లాక్ చేశారు. తాజాగా ఇప్పుడు విష్ణు మంచు ట్విట్టర్ లో ఈ సినిమా మొదటి సింగిల్‌ను జూలై 24 ఆదివారం ఉదయం 11:13 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పాటకు విష్ణు కుమార్తెలు అరియానా మరియు వివియానా తమ గాత్రాన్ని అందించారు. ఈ చిత్రాన్ని మంచు విష్ణు తన సొంత బ్యానర్ ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి అనూప్ రూబెన్స్ సంగీత అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa