మధు బండార్కర్ దర్శకత్వంలో మిల్కీ తమన్నా నటిస్తున్న బాలీవుడ్ సినిమా 'బబ్లీ బౌన్సర్'. ఇటీవలే షూటింగ్ పూర్తయింది. షూటింగ్ ఆఖరి రోజున చిత్రబృందం తో దిగిన ఫోటోలను తమన్నా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సినిమా లైఫ్ టైమ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చిందని తెలిపింది. తాజాగా ఈ సినిమా నుంచి తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా సెప్టెంబర్ 23 నుంచి చిన్న ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కామంది. తమన్నా నటిస్తున్న మరో రెండు హిందీ సినిమాలు బోలే చుడియన్, ప్లాన్ ఏప్లాన్ ఐ షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక తెలుగులో మిల్కీ బ్యూటీ హవా కొనసాగుతోంది. ప్రస్తుతం రెండు సినిమాలు.. భోళా శంకర్, గుర్తుందా శీతాకాలం సినిమాల్లో నటిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa