రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో రూపొందించిన 'ది వారియర్' మూవీ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన 6 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 24.50 కోట్ల గ్రాస్‌ను, 15.93 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 31.05 కోట్ల గ్రాస్‌ను, 18.43 కోట్ల షేర్‌ను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ఇంకా 20 కోట్లను రాబడితే బ్రేక్ ఈవెన్‌కి చేరుకుంటుందని అంటున్నారు.