టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, కృతిశెట్టి జంటగా నటిస్తున్న కొత్త చిత్రం "మాచర్ల నియోజకవర్గం". MS రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్లో పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించిన నటీనటుల ఫస్ట్ లుక్ పోస్టర్లను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నారు. వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. సెకండ్ లిరికల్ సాంగ్ గా రిలీజైన "రా రా రెడ్డి" ఐటెం సాంగ్ కు వస్తున్న రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి థర్డ్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చారు. ఈ పాట ఫుల్ వీడియోను జూలై 23వ తేదీన విడుదల చెయ్యబోతున్నట్టు నిన్న ఎనౌన్స్ చేసిన మేకర్స్ తాజాగా ఆ పాట గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. "అదిరిందే" అని సాగే ఈ పాటను సంజిత్ హెగ్డే ఆలపించారని, కృష్ణ కాంత లిరిక్స్ అందించారని తెలుపుతూ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు.