నటుడు, గాయకుడు సిద్దార్ధ్ ప్రముఖ హీరోయిన్ అదితి రావ్ హైదరీ పెళ్లి చేసుకోబోతున్నారంటూ మీడియాలో ప్రచారం జరుగుతుంది. వీరిద్దరూ కలిసి "మహాసముద్రం" సినిమాలో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా పరాజయం పాలైంది. ఈ మూవీ షూటింగ్ టైం లోనే సిద్దార్థ్, అదితి ప్రేమలో పడ్డారని టాక్. డీప్ రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ, ఇప్పటివరకు ఈ విషయాన్ని బహిర్గతం చెయ్యలేదు. సిద్దార్థ్, అదితిలు కలిసి మీడియాకు కూడా చిక్కలేదు.
తాజాగా అదితి ఇంటికి వెళ్తున్న సిద్దార్థ్ వీడియో మీడియాలో ఒక రేంజులో వైరల్ అవుతుంది. వీరిద్దరి మధ్య ఏమి లేకపోతే, యింటికెందుకు వెళ్తాడు? త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని? ప్రచారం జరుగుతుంది. మరి ఈ విషయంలో సిద్దార్ధ్, అదితి ఎలా స్పందిస్తారో చూడాలి.