"బ్రహ్మాస్త్ర" తో పాన్ ఇండియా మార్కెట్ ను ఎదుర్కోనున్న రణ్ బీర్ కపూర్ అంతకన్నా ముందుగా "షంషేరా"తో తెలుగు, తమిళంలో తన మార్కెట్ ఎలా ఉందో తెలుసుకోబోతున్నాడు. కరణ్ మల్హోత్రా డైరెక్షన్లో రణ్ బీర్ కపూర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, వాణికపూర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై యాభైవ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషలలో జూలై 22న అంటే రేపు విడుదలవనుంది. ఈ సినిమాలో రణ్ బీర్ తొలిసారి డ్యూయల్ రోల్ ను పోషించాడు. ఒకపక్క బ్రిటిష్ వారు, మరోపక్క సంజయ్ దత్ లాంటి క్రూరమైన పోలీసాఫీసర్ ను ఢీకొట్టే పవర్ఫుల్ రోల్ లో రణ్ బీర్ అద్భుతమైన నటన చూడాలంటే రేపు థియేటర్లకు వెళ్లాల్సిందే.