మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని నిన్న 33వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఉపాసన పుట్టినరోజు సందర్భంగా మెగా కాంపౌండ్ లో బిగ్ పార్టీ జరిగినట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఉపాసన, చెర్రీ, చిరంజీవి, సురేఖ లు కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చెర్రీ తన భార్యకు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపారు.
టాలీవుడ్ అభిమానులు ఇష్టపడే జంటలలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్-ఉపాసన ఒకరు. చరణ్ సోషల్ మీడియాలో అంతంతమాత్రంగానే ఉన్నా ఉపాసన ఎల్లప్పుడూ యాక్టీవ్ గానే ఉంటుంది. మెగా హైనెస్ అని అభిమానులు పిలుచుకునే ఉపాసనకు సోషల్ మీడియాలో భారీ ఫాలోవర్లే ఉన్నారు. అపోలో హాస్పిటల్స్ లైఫ్ విభాగానికి వైస్ ఛైర్మెన్ గా, బి పాజిటివ్ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్ గా బాధ్యతాయుత పొజిషన్లో ఉన్న ఉపాసన హెల్త్ టిప్స్ ను, మోటివేషనల్ కోట్స్ ను, సెలెబ్రిటీలతో తాను చేసిన ఇంటర్వ్యూలను, ఇంకా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఫోటోలు,వీడియోలను షేర్ చేస్తుంటుంది.