విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో, అక్కినేని నాగచైతన్య నటిస్తున్న ఫీల్ గుడ్ మూవీ "థాంక్యూ". ఇందులో రాశిఖన్నా, అవికాగోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 22 న విడుదల కాబోతుంది.
రేపు విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ నిమిత్తం తాజాగా చైతన్య విజయవాడ కి వచ్చారు. ఇక్కడ జరిగిన ప్రెస్ మీట్లో మీడియాతో ముచ్చటించారు. సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. రేపు విడుదలవబోతున్న ఈ చిత్రం పై చైతు అభిమానులు భారీ హోప్స్ పెట్టుకున్నారు.