యంగ్ హీరో విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం "లైజర్" ట్రైలర్ ఈ రోజు ఉదయం విడుదలైంది. ఎప్పటి నుండో ఈగర్ గా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు లైగర్ ట్రైలర్ కు విశేష ఆదరణ చూపిస్తున్నారు. తెలుగులో ఈ ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి గారు, డార్లింగ్ ప్రభాస్ విడుదల చేసారు. మలయాళంలో దుల్కర్ సల్మాన్ విడుదల చేసారు. ఇందుకు గానూ, లైగర్ విజయ్ దేవరకొండ వారందరికీ స్పెషల్ థాంక్స్ తెలియచేసారు. ఈ మేరకు చిరంజీవిని సర్, ప్రభాస్ ను అన్నా, దుల్కర్ ను కుంజిక్కా అని విజయ్ సంబోధించడం ఫ్యాన్స్ ను మరింత ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ప్రఖ్యాత బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాధ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఈ సినిమాతో భారతీయ సినీ రంగ ప్రవేశం చెయ్యడం విశేషం.ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.