టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తొలిసారి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం "లైగర్" ట్రైలర్ ఈరోజు ఉదయం విడుదలవగా, ఆ మెంటల్ మాస్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ విడుదలైన ఇరవై నిమిషాల్లో వన్ మిలియన్ వ్యూస్, అరగంటలో 100 కే లైక్స్ రాబట్టింది. దీంతో విజయ్ టైర్ 2 హీరోల్లో సరికొత్త రికార్డును నెలకొల్పాడు.
ఇప్పటివరకు విడుదలైన టైర్ 2 హీరోల కొత్త సినిమాల ట్రైలర్స్ లో నాగచైతన్య "లవ్ స్టోరీ" ట్రైలర్ విడుదలైన 24గంటల్లో అత్యధిక లైక్స్ (342కే )సాధించి, నెంబర్ వన్ పొజిషన్ లో ఉండగా, తాజాగా విజయ్ దేవరకొండ లైగర్ ట్రైలర్ తో ఆ రికార్డును బ్రేక్ చేసి, నయా రికార్డును నెలకొల్పాడు. లైగర్ ట్రైలర్ కు మూడున్నర గంటల్లోనే 342కే లైక్స్ రావడం విశేషం.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఈ చిత్రం లో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ప్రఖ్యాత బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాధ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఈ సినిమాతో భారతీయ సినీ రంగ ప్రవేశం చెయ్యడం విశేషం. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలకపాత్రను పోషిస్తుంది.