ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ అవార్డులను గెలుచుకున్న తెలుగు సినిమాలివే

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 22, 2022, 06:21 PM

68వ నేషనల్ అవార్డు జాబితాలో తెలుగు చిత్రాలు కూడా తళుక్కుమని మెరిసాయి. "అల వైకుంఠపురం" సినిమాకు గాను మంచి పాటలు కంపోజ్ చేసిన తమన్ కు జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు దక్కింది. ఆ సినిమా పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. జాతీయ ఉత్తమ తెలుగు భాషా చిత్రంగా "కలర్ ఫోటో" నిలిచింది. 2020లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సందీప్ రాజ్ డైరెక్షన్లో ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సుహాస్, చాందిని చౌదరి జంటగా నటించారు. జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు సంధ్య రాజుకి దక్కింది. నాట్యం సినిమాకు గానూ ఆమె ఈ అవార్డును గెలుచుకున్నారు. బెస్ట్ మేకప్ కు కూడా నాట్యం నేషనల్ అవార్డు గెలుచుకుంది. టి. రాంబాబు ఈ అవార్డును అందుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa