ఎన్టీఆర్ ‘అరవిందసమేత’ కౌంట్‌డౌన్ షురూ అయింది. త్రివిక్రమ్- ఎన్టీఆర్ క్రేజీ కాంబో కావటంతో ఈ సినిమా కోసం, సినిమా అప్‌డేట్స్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్స్, టీజర్ సినిమాపై భారీ హైప్ తీసుకురావడంతో జనాల్లో మరింత ఆసక్తి నెలకొంది. కాగా ఇటీవలే వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్త పోస్టర్‌తో శుభాకాంక్షలు తెలిపిన చిత్రయూనిట్.. ఇక ఒక్కో అప్‌డేట్ బయటకు వదిలేందుకు సిద్ధమైంది.
ఇందులో భాగంగా తాజాగా ‘అరవిందసమేత’ నుంచి స్పెషల్ లిరికల్ వీడియో బయటకు రానుందనే గుడ్ న్యూస్ అందించింది. 'అణగణగనగా..' అంటూ సాగిపోయే ఈ లిరికల్ వీడియో సాంగ్‌ని ఈ రోజు (శనివారం) సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయబోతున్నాం అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు యూనిట్ సభ్యులు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు. దసరా సందర్భంగా వచ్చే నెల 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa