స్విస్ టూరిజమ్‌ను ఇండియన్స్ ఎక్కువ ఆకర్షించడానికి బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా ఉపయోగపడ్డాయని భావించిన స్విస్ గవర్నమెంట్ ఆ మధ్య బాలీవుడ్ దర్శక–నిర్మాత యశ్ చోప్రా విగ్రహాన్ని ప్రతిష్టించింది. తాజాగా దివంగత నటి శ్రీదేవి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనుంది. . ఈ విగ్రహాన్ని ఆమె తనయ జాన్వీ కపూర్ ఆవిష్కరించనుంది. దాని కోసం జాన్వీ స్విస్ వెళ్లింది. బాలీవుడ్ ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా కూడా జాన్వీతో పాటు స్విస్ చేరుకున్నట్టు తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa