ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"మెగా 154" పై లేటెస్ట్ ఇంటరెస్టింగ్ బజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 26, 2022, 01:12 PM

కే ఎస్ రవీంద్ర (బాబీ) డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి, మాస్ రాజా రవితేజ కలిసి నటిస్తున్న చిత్రం "మెగా 154". ఇందులో శృతి హాసన్ కథానాయిక కాగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2023 జనవరిలో విడుదల కానుంది.
కమర్షియల్ హంగులతో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి, రవితేజ పోషించే పాత్రలపై ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే, ఈ సినిమాలో చిరు, మాస్ రాజా ఇద్దరూ అన్నదమ్ముల్లా నటించబోతున్నారట. ఐతే, విశేషమేంటంటే, ఇద్దరూ వేర్వేరు తల్లులకు పుట్టిన వారన్నమాట. రవితేజ తల్లిగా అలనాటి హీరోయిన్ సుమలత నటించబోతుందని కూడా టాక్ నడుస్తుంది. మరి ఈ విషయాలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com