ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నాని బండ్రెడ్డితో ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'రాజమండ్రి రోజ్ మిల్క్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. జై జాస్తి, అనంతిక సనీల్‌కుమార్‌లు ఈ సినిమాలో ప్రధాన జంటగా నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలోని రెండవ పాటను మూవీ మేకర్స్ విడుదల చేసారు. 'నువ్వే ముద్దుగా' అనే టైటిల్ తో వచ్చిన ఈ పాటకి లిరిక్స్ చంద్రబోస్ రచించగా, అనురాగ్ కులకర్ణి పాడారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్‌లు సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంట్రూప్ ఫిలింస్‌తో కలిసి నిర్మించిన ఈ చిత్రానికి గోవింద్ వసంత, యశ్వంత్ నాగ్, భరత్-సౌరభ్ మరియు అజయ్ అరసాద సంగీత అందిస్తున్నారు.