రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'చంద్రముఖి 2' మూవీలో ఐదుగురు హీరోయిన్ నటించబోతున్నారట. ఇందులో మెయిన్ హీరోయిన్‌గా లక్ష్మీ మేనన్‌ను ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం మేరకు ఇందులో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు ఉంటారట. వారిలో మహిమా నంబిరాయర్‌ను ఒక హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈమె మైసూరులో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇక మిగిలిన నలుగురు ఎవరనేది తెలియాల్సి ఉంది.