"పెళ్లి సందడి" 2 సినిమాతో టాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన కన్నడ భామ శ్రీలీల. ఆపై వరస సినిమాల్లో ఛాన్సులు కొట్టేసిన శ్రీలీల ప్రస్తుతం ఆ సినిమాల షూటింగులతో బిజీగా ఉంది.
కన్నడలో ఆమె నటించిన "ఐ లవ్ యూ ఇడియట్" అనే చిత్రానికి సంబంధించిన తెలుగు టీజర్ రేపు మధ్యాహ్నం 12: 05 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ కొంచెంసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేసారు. కన్నడ డైరెక్టర్ AP అర్జున్ డైరెక్షన్లో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని సాయి కిరణ్ బత్తుల, సుదర్శన్ గౌడ్ బత్తుల తెలుగులో విడుదల చేస్తున్నారు. హరికృష్ణ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.