టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్, 'RX100' ఫేమ్ పాయల్ రాజ్ పుత్ జంటగా నటిస్తున్న చిత్రం "తీస్మార్ ఖాన్". కళ్యాన్జీ గోగన డైరెక్షన్లో పక్కా యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను విజన్ సినిమాస్ బ్యానర్ పై నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి 'సమయానికే' అనే ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ అవ్వగా, ఆ పాట యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ మ్యూజిక్ లో స్థానం సంపాదించి దూసుకుపోతుంది. హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ గీతంగా చిత్రీకరించిన ఈ పాట మెలోడియస్ గా సాగుతుంది. ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యమందించగా, శృతి ఆలపించారు.
ఈ సినిమాలో సునీల్, పూర్ణ, కబీర్ సింగ్, అనూప్ సింగ్ ఠాకూర్ కీలక పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 19వ తేదీన థియేటర్లలో విడుదల కాబోయే ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందించారు.