టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న కొత్త చిత్రం "మాచర్ల నియోజకవర్గం". ఇందులో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో MS రాజశేఖర్ రెడ్డి డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. మహాతిస్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ గా ట్రైలర్ లాంచ్ డీటెయిల్స్ ను మేకర్స్ వెల్లడించారు. జూలై 30వ తేదీన విడుదలవ్వబోయే MNV ట్రైలర్ యొక్క లాంచింగ్ ఈవెంట్ గుంటూరు, బ్రాడీపేట, LEM స్కూల్ గ్రౌండ్స్ లో నిర్వహించబడుతుందని ప్రకటించారు. ఆ రోజు సాయంత్రం ఐదు గంటల నుండి ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.