మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో చిత్ర పరిశ్రమలోకి వచ్చినా, తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నారు ప్రముఖ నటి నిహారిక. 2020 చైతన్య జొన్నలగడ్డని ఆమె వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తన భర్త బర్త్ డే సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. హ్యాపీ బర్త్ డే చెయ్.. నా కూలెస్ట్ కుకుంబర్. నీ క్రేజీ నెస్‌కి, నువ్వు ప్రశాంతంగా ఉన్నందుకు థాంక్స్. లవ్ యూ బేబీ అంటూ ట్వీట్ చేసింది.